నాంపల్లి కోర్టులో బెయిల్‌ పేపర్స్ సమర్పించిన అల్లు అర్జున్

నాంపల్లి కోర్టులో బెయిల్‌ పేపర్స్ సమర్పించిన అల్లు అర్జున్

నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన బ‌న్నీ బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయ‌మూర్తి ముందు హాజ‌రైన బ‌న్నీ రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. మ‌రోవైపు రెండు నెలల పాటు ప్ర‌తి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయ‌స్థానం అల్లు అర్జున్‌ని ఆదేశించింది. రేవ‌తి మ‌రణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ ఆయ‌న‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్‌ ముగియడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై శుక్రవారం విచార‌ణ చేప‌ట్టిన‌ నాంప‌ల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది.

editor

Related Articles