సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సామ్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో బిజీబిజీగా ఉంటారు. ఎక్స్‌లో అకౌంట్ ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. తాజాగా మళ్లీ ఎక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సామ్. 2023లో ఆమె ఓ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సంస్థపై తీసిన ‘శుభం’ అనే సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని ఎక్స్‌లో తెలుపుతూ.. ‘పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకందిస్తున్నాం.. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకెంతో ప్రత్యేకం. గొప్ప ప్రారంభం కూడా’ అంటూ రాసుకొచ్చారు. సామ్ ఒక్కసారిగా ఎక్స్‌లో ప్రత్యక్షమవ్వగానే ఆమె ఫాలోయర్స్ ఆనందం వెలిబుచ్చారు. ‘వెల్‌కమ్ బ్యాక్ సామ్..’, ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- April 8, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor