బుల్లితెర రియాలిటీ షో కన్నడ బిగ్‌బాస్‌కి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. హలీవుడ్ షో బిగ్ బ్రదర్‌కి మాతృకగా వచ్చిన బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీలోనే కాకుండా తమిళం, కన్నడలోను ఈ షో టాప్ రియాలిటీ షోలలో ఒకటిగా నిలిచింది. అయితే కన్నడ బిగ్ బాస్ షోకి సంబంధించి హోస్ట్‌గా చేస్తున్న హీరో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ షోకి తాను ఇకపై హోస్ట్‌గా చేయనని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పటివరకు 11 సీజన్‌లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇందులో 11 సీజన్‌లకు సుదీప్ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ నటుడు తాజాగా కన్నడ బిగ్‌బాస్‌కి దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఈ షోకి హోస్ట్‌గా చేసిన నాపై మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. త్వరలో జరుగనున్న ఫినాలేతో బిగ్‌బాస్‌తో నా ప్రయాణం ముగుస్తుంది. వ్యాఖ్యాతగా నా శక్తి మేరకు మీ అందరినీ ఎంటర్‌టైన్ చేశాననే అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కలర్స్ కన్నడ టీవీ వారికి ధన్యవాదాలు.

- January 20, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor