టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య సాయిపల్లవి ప్రస్తుతం తండేల్‌లో నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా చందూ మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే లవ్ స్టోరీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ యాక్టర్లు ప్రస్తుతం తండేల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా మరో క్రేజీ నిర్ణయాన్ని తీసుకున్నారన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తండేల్ మలయాళం వెర్షన్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. సాయిపల్లవికి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉందని తెలిసిందే. తండేల్ నుండి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. 2018లో గుజరాత్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

- January 20, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor