న‌టుడు విజ‌య రంగరాజు ఇక లేరు..

న‌టుడు విజ‌య రంగరాజు ఇక లేరు..

నటుడు విజయ రంగరాజు  మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో రంగ‌రాజు మ‌రణించిన‌ట్లు స‌మాచారం. ఇక రంగ‌రాజు మ‌ర‌ణవార్త తెలుసుకున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. విజయ రంగరాజు అస‌లు పేరు రాజ్ కుమార్. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా మొదటి సినిమా. అయితే అత‌డికి గుర్తింపు ల‌భించింది మాత్రం బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన భైరవ ద్వీపం సినిమా ద్వారా. ఈ సినిమాలో అత‌డి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌డ‌మే కాకుండా సినిమాల్లో ఫుల్ బిజీగా మారిపోయాడు. గోపీచంద్ న‌టించిన‌ ‘యజ్ఞం’ సినిమాలో ఆయ‌న విల‌న్‌గా న‌టించ‌డం అత‌డి కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆయ‌న చెప్పేవారు.

editor

Related Articles