ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన మంచు లక్ష్మి

ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన మంచు లక్ష్మి

మంచు కుటుంబంలో విభేదాలు సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అయ్యింది. ఇన్ని రోజులూ గుట్టుగా సాగిన ఇంటి గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌ బాబు  ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఈ క్రమంలో రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై  మోహన్‌ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దాడి అనంతరం మోహన్‌ బాబు సైతం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి  పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

editor

Related Articles