హనుమంతుడిగా సన్నీ డియోల్..

హనుమంతుడిగా సన్నీ డియోల్..

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుటుంది.

ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘రాముడి పాత్ర పోషించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరుతోంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, కుటుంబ విలువలను, అన్నదమ్ముల అనుబంధాన్ని చెప్పిన మహాకావ్యం రామాయణం. దాని ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నేను భాగం అయి నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్‌ పార్ట్‌కి షూటింగ్ పూర్తి కాగా త్వరలో రెండో పార్ట్‌ షూటింగ్‌ మొదలవుతుంది’ అని చెప్పారు. తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు’ అని చెప్పారు సన్నీ డియోల్.

editor

Related Articles