IMDb: టాప్ ప్లేస్‌లో త్రిప్తి డిమ్రీ

IMDb: టాప్ ప్లేస్‌లో త్రిప్తి డిమ్రీ

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా ఎక్కువగా వెతికిన హీరో హీరోయిన్లకు  ర్యాంకింగ్స్‌ను వెల్లడించారు. ఈ జాబితాలో ఊహించని విధంగా టాప్ ప్లేస్‌లో త్రిప్తి డిమ్రీ నిలిచారు. రెండవ స్థానంలో దీపికా పదుకొణె, మూడులో హీరో ఇషాన్  ఖత్తర్ ఉన్నారు. నాలుగో స్థానంలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్, ఐదులో నటి శోభితా ధూళిపాళ  ఉన్నారు. ఆరులో శార్వారీ, ఏడవ స్థానంలో ఐశ్వర్యారాయ్ , ఎనిమిదో స్థానంలో స్టార్ హీరోయిన్ సమంత ఉన్నారు. తర్వాత స్ఠానాల్లో నటి ఆలియా భట్, ప్రభాస్ నిలిచారు.

editor

Related Articles