శివ కార్తికేయన్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన అక్కకి సంబంధించిన ఓ పోస్ట్ షేర్ చేశాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన అక్కకి సంబంధించిన ఓ పోస్ట్ షేర్ చేశాడు.” మై డియర్ అక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత MBBS పూర్తిచేశావు. MBBS పూర్తి చేయడం నుండి 38 సంవత్సరాల వయస్సులో గోల్డ్ మెడల్‌తో మెరిట్‌పై MD సంపాదించావు. ఇక ఇప్పుడు 42 సంవత్సరాల వయస్సులో FRCP సాధించావు. ఇప్పటివరకు అన్ని సాధించుకుంటూ వచ్చావు. నిన్ను చూసి నాన్న గర్వపడుతుంటారు. హ్యాపీ బర్త్ డే అక్క.. థ్యాంక్ యూ అథాన్ ఎల్లప్పుడూ అక్కకు అండగా నిలుస్తున్నందుకు ” అని ఎమోషనల్‌గా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. నిజంగా ఈ వయస్సులో ఆవిడ ఇంత సాధించారంటే గ్రేట్ అనే చెప్పాలి. పిల్లలు పుట్టాక కూడా ఆమె తన చదువు ఎక్కడా మానెయ్యకుండా కంటిన్యూ చేస్తూ ఇంతవరకు వచ్చింది అంటే సో నైస్..

- December 5, 2024
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor