డీజే టిల్లు భామ టైసన్‌ నాయుడు లుక్‌ వైరల్

డీజే టిల్లు భామ టైసన్‌ నాయుడు లుక్‌ వైరల్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్  బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని మీకు తెలుసు. ఈ సినిమాలో ఒకటి టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న టైస‌న్ నాయుడు. భీమ్లానాయక్ ఫేం సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డీజే టిల్లు భామ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా బర్త్‌ డే సందర్భంగా విషెస్‌ తెలియజేస్తూ కొత్త లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట–గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన టైస‌న్ నాయుడు టైటిల్‌, ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో బెల్లంకొండ డీఎస్పీగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది‌. బెల్లంకొండ పోలీసాఫీసర్‌గా నటించిన రాక్షసుడు సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఖాకీ చొక్కా వేసుకొని పోలీసు ఆఫీసర్‌గా యాక్ట్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.

editor

Related Articles