హనుమంతుడి పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం..

హనుమంతుడి పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం..

‘రామాయణ’లో హనుమంతుడిగా మీ ముందుకు రాబోతున్నా అన్న సన్నీడియోల్. ఒక నటుడిగా నాకిది సవాల్‌.’ అని సన్నీడియోల్‌ అన్నారు. బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ‘రామాయణ’ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నితేష్‌ తివారీ దర్శకుడు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ పౌరాణిక హిందీ చిత్రంలో యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ఆంజనేయుడి పాత్రను సన్నీడియోల్‌ పోషిస్తున్నారు. తాజాగా ఈ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడారు. ‘నాకు స్వతహాగా ఈ తరహా పాత్రలు ఇష్టం. ఎందుకంటే సరదాగా ఉంటాయి. తేలిగ్గా జనాల్లోకి వెళ్లిపోతాయి. ఇప్పటివరకూ షూటింగ్‌లో అయితే పాల్గొనలేదు. ఇంకా షూటింగ్‌లో నా పాత్రకు పిలుపు రాలేదు.

editor

Related Articles