పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజున చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఎంతో బాధించింది. సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వెంటనే సింగపూర్ బయలు దేరారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు. నేటి తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు పవన్. నిన్న రాత్రే మీడియాముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వేసవి కేంప్‌లో భాగంగా జరిగే చిన్న పిల్లల ఈవెంట్‌లో నా భార్యకూడా ఉందని చెప్పారు. మార్క్ శంకర్‌ను చూసేందుకు పవన్ కళ్యాణ్‌తో పాటుగా చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్‌కు బయల్దేరారు. మార్క్ శంకర్‌తో అక్కడ అన్నా లెజినోవా ఒక్కరే ఉండడంతో ఆమెకు తోడాగా, భరోసానిచ్చేందుకు సురేఖ కొణిదెల కూడా సింగపూర్ బయల్దేరారు. దురదృష్టవశాత్తు మా పిల్లాడి పక్కనే ఉన్న చిన్నపాప చనిపోయింది. అందుకు నాకు చాలా బాధగా ఉందని పవన్ ప్రెస్ మీట్‌లో తెలియజేశారు.

- April 9, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor