ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా గురించి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో రూపొందుతోన్న తొలి కామెడీ హర్రర్ సినిమా ఇది. ఈ తరహా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు మారుతి సిద్ధహస్తులు. ప్రభాస్ లాంటి సూపర్‌హీరోతో హర్రర్ కామెడీ అనగానే.. ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడుతున్నారు. మారుతి గారు కావాల్సినంత సమయం తీసుకోండి.. పర్లేదు. నవంబరైనా, వచ్చే ఏడాదైనా మేం బాధపడం. అయితే.. రిలీజ్ విషయంలో అధికారికంగా సమాచారం ఇవ్వండి. అప్పుడు అభిమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు.’ అని పేర్కొన్నాడు. దానిపై దర్శకుడు మారుతి స్పందిస్తూ.. ‘కొంచెం టాకీ పార్ట్, కొన్ని పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అవి పూర్తవ్వగానే లిరికల్ వీడియోలు విడుదల చేస్తాం. ఈ సినిమాకు సీజీ వర్కే ప్రాణం. ఈ ప్రాసెస్‌లో ఎన్నో అంశాలు ఇన్వాల్వ్ అయివున్నాయి. ఇది ఒక్కరు చేసే పనికాదు. సమయం పడుతుంది. సీజీ వర్క్ వెరిఫికేషన్ అవ్వగానే నిర్మాతలే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అంచనాలు అందుకునేందుకు అంతా కష్టపడుతున్నాం. కాస్త ఓపిక పట్టండి.’ అంటూ మారుతి చెప్పుకొచ్చారు.

- April 9, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor