కోలీవుడ్ హీరోగా అజిత్ అశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అజిత్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయన తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్, షాలినిల కూతురు అనౌష్క కూడా తన తండ్రి సినిమా థియేటర్స్‌లో చూసేందుకు వచ్చింది. అజిత్ కుమార్ కుమార్తె అనౌష్క సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే అజిత్ సినిమా కోసం బయటకు వచ్చిన అనౌష్కని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. అనౌష్కకి ఇప్పుడు 17 ఏళ్లు. ఎరుపురంగు టాప్, నల్ల ప్యాంటు ధరించి థియేటర్‌కి వచ్చిన అనౌష్కని చూశాక అన్ని కెమెరాలు ఆమె వైపే తిరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అనౌష్కకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ అంటున్నారు.

- April 11, 2025
0
9
Less than a minute
You can share this post!
editor