హాలీడే రోజు-మే 1న వస్తున్న కూలీ..?

హాలీడే రోజు-మే 1న వస్తున్న కూలీ..?

తమిళ హీరో రజినీకాంత్‌  ఇటీవలే వెట్టైయాన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. కాగా తలైవా టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న తాజా సినిమా కూలీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ వహిస్తున్నాడు. కూలీ స్టైలిష్‌ యాక్షన్‌ పార్ట్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన కూలీ టైటిల్‌ టీజర్‌లో బంగారంతో డిజైన్‌ చేసిన ఆయుధాలు, వాచ్‌ ఛైన్లతో సూపర్ స్టార్‌ చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ పార్ట్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. కోలీవుడ్‌ నుండి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ కూలీకి సంబంధించి చాలారోజుల తర్వాత విడుదల తేదీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ సినిమాని హాలీడే రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే కూలీ చిత్రాన్ని మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. గోల్డ్‌ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కూలీలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్‌, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్‌ బాయ్స్ ఫేం సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం.

administrator

Related Articles