తమిళ హీరో విజయ్ కాంపౌండ్ నుండి రాబోతున్న సినిమా దళపతి 69. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్ కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు. ఈ మూవీ 2025 దీపావళి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో దళపతి 69 చివరి సినిమా కానుండటంతో.. ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

- November 13, 2024
0
30
Less than a minute
Tags:
You can share this post!
administrator