ఇచ్చినమాట ప్రకారం ఆ టైమ్‌కే వచ్చేస్తాడు!

ఇచ్చినమాట ప్రకారం ఆ టైమ్‌కే వచ్చేస్తాడు!

పవన్‌కళ్యాణ్‌ సోలో హీరోగా కనిపించి నాలుగేళ్లయ్యింది. అందుకే.. అభిమానులు పవర్‌స్టార్‌ సోలో ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయనవి రెండు సినిమాలు సెట్స్‌ మీదున్నాయి. వాటిలో ఒకటి ‘హరిహర వీరమల్లు’ కాగా, రెండోది ‘ఓజీ’. రెండు సినిమాల షూటింగులూ దాదాపు పూర్తికావొచ్చాయి. అయితే.. వాటిలో ముందు ‘హరిహర వీరమల్లు’ ఉంటుందని గతంలోనే వెల్లడించారు. ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్టు డేట్‌ను కూడా ప్రకటించారు. అయితే.. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ విడుదల ఆలస్యం కానున్నదంటూ కొన్ని వార్తలు మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేశాయి. దీనిపై నిర్మాత ఎఎం రత్నం స్పందించారు. “హరిహర వీరమల్లు’ను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్‌కే విడుదల చేస్తాం. ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ వర్క్‌ పూర్తయింది. బ్యాలన్స్‌ వర్క్‌ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి అనుకున్న డేట్‌కే విడుదల చేస్తాం’ అని తెలిపారు ఎఎం రత్నం. ఈ సినిమాలోని రెండో పాట ఈ నెల 24న విడుదల కానున్నది.

editor

Related Articles