టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు సినిమా ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన ప్రేక్షకులు మన సినిమాలు తప్ప అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారని వెల్లడించారు. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా డ్రాగన్. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, ఖయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న తమిళంతో పాటు తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తెలుగులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు దర్శకులు హరీష్ శంకర్, సాయిరాజేష్, కిషోర్ తిరుమల, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

- February 18, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor