రజనీకాంత్‌ సినిమాలో స్పెషల్ సాంగ్

రజనీకాంత్‌ సినిమాలో స్పెషల్ సాంగ్

హిందీలో వరుస పరాజయాలు పలకరించడంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెడుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. దళపతి విజయ్‌ ‘జన నాయగన్‌’, సూర్య ‘రెట్రో’ సినిమాల్లో ఈ హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లో ఈ హీరోయిన్ మరో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాలో పూజాహెగ్డే స్పెషల్‌సాంగ్‌లో డ్యాన్స్ చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్‌ జరుగుతోందని, ఇందులో పూజాహెగ్డే డ్యాన్స్‌లు  ప్రధానాకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు అంటున్నారు. పూజాహెగ్డేకు ఐటెంసాంగ్స్‌ కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం, ఎఫ్‌-3 చిత్రాల్లో ఈ హీరోయిన్ ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ సినిమా ‘దేవ’ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలవడంతో పూజాహెగ్డేకు నిరాశే ఎదురైంది. ఇకపై దక్షిణాది సినిమాలకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనలో ఉందట పూజాహెగ్డే.

editor

Related Articles