హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ రీసెంట్‌గా గాయపడిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె గాయానికి గల కారణం మాత్రం ఎవరికీ తెలీదు. రీసెంట్‌గా ఈ విషయంపై రకుల్ స్పందించింది. తానెందుకు గాయపడిందో ఓ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. అది అక్టోబర్ 5. ఎప్పట్లాగే ఉదయం జిమ్‌కి వెళ్లాను. 80 కేజీలు లిఫ్ట్ చేశాను. ఉన్నట్టుండి వెన్నులో నొప్పి మొదలైంది. జిమ్‌లో ఇలాంటి నొప్పులు సహజం. అందుకే పట్టించుకోలేదు. ఇంటికెళ్లి, రెడీ అయ్యి షూటింగ్‌కి వెళ్లిపోయాను. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. షూటింగ్ ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చాక, నొప్పి అధికమైంది. వంగోలేకపోయాను. చివరకు దుస్తులు కూడా మార్చుకోలేకపోయాను. జిమ్‌కి వెళ్లడం ఆపితే తగ్గిపోతుందిలే అనుకొని నాలుగురోజులు జిమ్‌కి గ్యాప్ ఇచ్చాను.
నాలుగోరోజు నడుము కింద భాగం మొద్దుబారిపోయింది. బీపీ కూడా డౌన్ అయ్యింది. ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాను. ఇంట్లో వాళ్లు హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. జిమ్ కెళ్లేవాళ్లు వెన్ను నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు. అది లైఫ్‌నే ప్రమాదంలో పడేసే ఛాన్సుంది. ఏదేమైనా ప్రస్తుతమైతే నా ఆరో గ్యం కుదుటపడింది. నేను బాగానే ఉన్నా ను అంటూ చెప్పుకొచ్చింది రకుల్.