తెలుగు సినిమా హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, ఫేన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే అని చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా యువతలో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పీరియాడిక్ కథతో రూపొందుతోంది. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నారని సమాచారం. గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి ‘జటాయు’ పేరుతో ఓ వైవిధ్యమైన కథను విజయ్ దేవరకొండకు వినిపించారని, ఇప్పుడు ఆ కథకు ఆయన ఓకే చెప్పారని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఒక కొత్త ఒరవడిలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

- December 5, 2024
0
76
Less than a minute
You can share this post!
editor