‘పుష్ప 2’తో ఆల్ ఇండియా హిట్.. : RGV

‘పుష్ప 2’తో ఆల్ ఇండియా హిట్.. : RGV

నేష‌న‌ల్ అవార్డు గ్రహీత, హీరో అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ర‌ష్మిక మందన్నా క‌థానాయిక‌గా న‌టించింది. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు వ‌రల్డ్ వైడ్‌గా మూవీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ప్రీమియ‌ర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఇదిలావుంటే ఈ మూవీపై దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టాడు. పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. అల్లు అర్జున్ ఈజ్ మెగా స్టార్ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

editor

Related Articles