ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి లీకుల బెడద, పైరసీ పెనుభూతాలుగా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా సినిమా ఇంటర్నెట్‌లోకి వచ్చేస్తుంది. ఆన్‌లైన్‌లో సినిమాను లీక్ చేయకూడదని చిత్రబృందం కోర్టుకు వెళ్లినా, కొత్త సినిమాల లీకేజ్‌లు యధేచ్చగా సాగుతున్నాయి. తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు కాస్త లేట్‌గా ఇంటర్నెట్‌లోకి వస్తున్నా, పెద్ద హీరోల సినిమాలు మాత్రం రిలీజైన కొద్ది గంటలలోనే ఇంటర్నెట్‌లోకి వస్తుండడం అందరికీ షాకింగ్‌గా మారింది. ఇలా లీక్ కావడం వలన కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే సంస్థలు వసూళ్ల పరంగా అనేక సమస్యలని ఎదుర్కొంటున్నాయి. తాజాగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదలైన 8 గంటల్లోనే ఇంటర్నెట్‌లోకి వచ్చేసింది. హెచ్ డీ ప్రింట్‌తో వివిధ వెబ్ సైట్స్‌లో అజిత్ సినిమా లీక్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది విన్న అజిత్, చిత్ర బృందం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

- April 11, 2025
0
13
Less than a minute
You can share this post!
editor