మాస్ మహరాజా రవితేజ హిట్టు కొట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో ధమాకాతో హిట్టు అందుకున్న రవితేజకి ఆ తర్వాత మళ్లీ హిట్ పడలేదు. గతేడాది వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు పరాజయం అందుకున్నాయి. దీంతో ఎలాగైన హిట్టు కొట్టాలనే కసి మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు. తు మేర లవర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ పాటలలో ఒకటైన ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

- April 10, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor