టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమాకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో హైదరాబాద్ బ్యూటీ టబు హీరోయిన్‌గా నటించబోతోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లతో పాటు ఇండస్ట్రీ హిట్‌లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో చేతులు కలిపాడు. ‘పూరి కనెక్ట్స్’ ఈ సినిమాను నిర్మించనుండగా.. ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రలో టబు నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా పోస్ట్ పెట్టింది. టబు ఇందులో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాత.

- April 10, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor