టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సినీ రంగంలో మరో వినూత్న ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. క్వాంటం ఎఐ గ్లోబల్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త వెంచర్ ద్వారా సినీ రంగంలో అత్యాధునిక ఎఐ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో మే 4న కంపెనీ పేరుతో సహా పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ ప్రకటనను దిల్ రాజు కంపెనీ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది, ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ కొత్త కంపెనీ వినోద రంగానికి ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన ఎఐ సాధనాలను అభివృద్ధి చేసి అందించనుంది. దిల్ రాజు ఈ సహకారం గురించి మాట్లాడుతూ, సినిమా నిర్మాణంలో ఎఐ సాంకేతికత ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ప్రకటన కొంత సినీ అభిమానులు, ఇండస్ట్రీ నిపుణులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- April 16, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor