దోశ ప్లస్ పావు బాజీ నా ఫేవ‌రేట్ ఫుడ్ అని చెప్పిన త‌మ‌న్నా!

దోశ ప్లస్ పావు బాజీ నా ఫేవ‌రేట్ ఫుడ్ అని చెప్పిన త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ వైపు గ్లామర్ ఇమేజ్‌ కంటిన్యూ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతున్నారు. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకి కొనసాగింపుగా ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన‌ ఓదెలా 2 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, ఇందులో త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ సినిమా రిలీజైన రెండు వారాల తరువాత రైడ్‌ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మిల్కీ భామ‌. ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. తాజాగా త‌మ‌న్నా ఓదెల 2 చిత్ర ప్రమోషన్లలో భాగంగా హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ తింటూ కనిపించింది. ఆ స‌మ‌యంలో మీకు ఇష్ట‌మైన ఫుడ్ ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఒక చాట్ స్పాట్‌లో దర్శనమిచ్చిన త‌మ‌న్నా త‌న‌కి స్ట్రీట్‌ఫుడ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, అందులో హైద‌రాబాద్ స్ట్రీడ్ ఫుడ్‌ని చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని పేర్కొంది. దోశ ప్లస్ పావు బాజీ నా ఫేవ‌రేట్ ఫుడ్ అని చెప్పింది త‌మ‌న్నా. కానీ త‌మ‌న్నా మాత్రం ఈ రెండింటినీ క‌లిపి తింటుంద‌ట‌. ఇది విని అంద‌రూ అవాక్క‌వుతున్నారు. బిర్యాని కూడా త‌న‌కి ఇష్ట‌మ‌ని, హైదరాబాద్ బిర్యానీకి ఏదీ సాటి రాదని పేర్కొంది. మొత్తానికి త‌మ‌న్నా ఫేవ‌రేట్ ఫుడ్ తెలుసుకున్న నెటిజ‌న్స్ తాము కూడా ఓ సారి అలా తింటే పోలా అనుకుంటున్నారు.

editor

Related Articles