వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. మార్చి 28, 2025 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకి ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ బజ్‌ని మరింతగా పెంచుతూ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి వార్నర్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వెంకీ కుడుముల వార్నర్‌కు హృదయపూర్వక స్వాగతం పలికాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి హెచ్ఐసిసి నోవాటెల్ హైదరాబాద్‌లో జరగనుంది. మొత్తానికి ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి వస్తున్న ప్రమోషన్స్ సహా కంటెంట్ మంచి హిట్ కూడా అయ్యాయి. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

- March 23, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor