డైరెక్టర్ నీల్‌తో తారక్ లేట్ నైట్ ముచ్చట్లు..!

డైరెక్టర్ నీల్‌తో తారక్ లేట్ నైట్ ముచ్చట్లు..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ప్రెస్టీజియస్ యాక్షన్ సీక్వెల్ సినిమా ‘వార్-2’లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. త్వరలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఇక తాజాగా, నీల్‌తో ఎన్టీఆర్ ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి సమయంలో ఎన్టీఆర్-నీల్ ముచ్చట్లు పెడ్తున్న పిక్‌ను లిఖిత రెడ్డి పోస్ట్ చేసింది. దీంతో వారిద్దరు ఏ విషయాన్ని చర్చిస్తున్నారా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

editor

Related Articles