మలయాళ నటి, ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో జరిగిన మ్యాచ్‌లకు హాజరైన ఆమె సెంటర్ కోర్టులో ప్రేక్షకులతో కలిసి ఉత్సాహంగా మ్యాచ్‌లను ఆస్వాదించారు.
క్లాసిక్ స్టైల్‌లో కనిపించిన కళ్యాణి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు టెన్నిస్‌పై కూడా తనకు ఉన్న ఆసక్తిని ఆమె ఈ సందర్భంగా చాటుకున్నారు. మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షిస్తూ కనిపించిన ఆమెకు సంబంధించిన సినిమాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో వింబుల్డన్ వేదికపై కళ్యాణి సందడి సినీ, క్రీడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

