దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ థియేటర్లలో మంచి ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ వినూత్న కథకు మంచి స్పందన తెలుపుతున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో ఈ సినిమా ఆరో స్థానంలో కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ సినిమాలోని కథ, తెరకెక్కించిన విధానం, సృజనాత్మకతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో తులసి శివమణి, బెనర్జీ, శివ నారాయణ, స్టాన్లీ చిడోజీ కీలక పాత్రలు పోషించారు. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రాంతీయ సినిమాగా విడుదలైన ‘సింగ్ గీతం’ ఇప్పుడు ఓటీటీలో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతూ విజయవంతంగా దూసుకెళ్తోంది.

