‘లెనిన్’కు పెరుగుతున్న కలెక్షన్స్

‘లెనిన్’కు పెరుగుతున్న కలెక్షన్స్

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మొదటి రోజు రూ.16.7 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు ఏకంగా రూ.20.5 కోట్లకు పైగా వసూలు చేసి కలెక్షన్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. పాజిటివ్ టాక్‌తో పాటు వీకెండ్ కావడంతో థియేటర్లకు ప్రేక్షకుల రద్దీ పెరగడం ఈ వసూళ్లకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ఆదివారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో, మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి స్పందనతో నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా, ‘లెనిన్’తో అఖిల్ అక్కినేని ఆశించిన విజయానికి బలమైన ఆరంభం లభించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles