మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతోంది.
తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం ఫస్ట్ కాపీని వీక్షించిన అనంతరం ఇంటర్వెల్ సన్నివేశాల్లో మరికొన్ని షాట్లు జోడించాలని భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రవితేజతో ఒక రోజు రీషూట్ నిర్వహించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళంలో ఈ సినిమా ‘ఇరుముడికట్టు’ పేరుతో విడుదల కానుంది. గతంలో రవితేజ మాట్లాడుతూ, “కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి కథే ‘ఇరుముడి’. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. బేబీ నక్షత్ర ఈ సినిమాలో రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది.

