కత్తిపోట్లతో 8 సినిమాలకు బ్రేక్..?

కత్తిపోట్లతో 8 సినిమాలకు బ్రేక్..?

హీరో సైఫ్‌ అలీఖాన్‌పై దొంగచేసిన దాడి ఘటన యావత్‌ బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం ఆయన ముంబయి లీలావతి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆరుచోట్ల కత్తిపోట్లకు గురికావడంతో శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సైఫ్‌అలీఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రాల షూటింగ్స్‌ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సైఫ్‌అలీఖాన్‌ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. దాడి ఘటన వల్ల ఈ సినిమా షూటింగ్స్‌ను రీషెడ్యూల్‌ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సైఫ్‌అలీఖాన్‌ హిందీలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘జువెల్‌ థీఫ్‌: ది రెడ్‌ సన్‌ చాప్టర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. తాజా ఘటనతో చిత్రీకరణ సందిగ్ధంలో పడింది. వీటితోపాటు ‘షూట్‌ ఔట్‌ ఎట్‌ బైకుల్లా’ సినిమాలో కూడా సైఫ్‌అలీఖాన్‌ నటిస్తున్నారు.

editor

Related Articles