సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే విలేజ్ డ్రామా – తిమ్మరాజుపల్లి టీవీ..!

సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే విలేజ్ డ్రామా – తిమ్మరాజుపల్లి టీవీ..!

ఈతరం పిల్లలు చూడని ప్రపంచాన్ని తెరపై చూపించబోతున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు వి. మునిరాజు తన చిన్ననాటి అనుభవాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్ ఫీల్‌ను అందిస్తుంది.
మా ఊరికి టీవీ వచ్చిన రోజుల్లో జరిగిన సంఘటనలే ఈ సినిమాకు ప్రేరణగా నిలిచాయి. ఆ కాలపు సంస్కృతి, మనుషుల మధ్య సంబంధాలు, భావోద్వేగాలను సహజంగా చూపించారు. జెన్ జీ ప్రేక్షకులకు ఇది పూర్తిగా కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. రాయలసీమలోని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ మూవీ విజువల్స్, సింగిల్ టేక్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కంటెంట్ బలంగా ఉన్న ఈ చిత్రం చిన్న సినిమాలకు కొత్త దారిని చూపించనుంది.

Related Articles