విజయ్ సేతుపతి హీరోగా యాక్ట్ చేస్తున్న క్రైమ్ కామెడీ సినిమాకి అరుముగకుమార్ డైరెక్టర్. రుక్మిణీవసంత్ హీరోయిన్. ఈ సినిమా టైటిల్, టీజర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం విజయ్ సేతుపతి బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ‘బోల్డ్ కన్నన్’ అనే పాత్రలో కనిపిస్తారు. తాజా గ్లింప్స్‌లో ఆయన సంప్రదాయ తమిళ దుస్తులు ధరించారు. మలేషియా విమానాశ్రయంలో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలతో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సినిమాలో వివిధ పాత్రల్లో యోగిబాబు, బి.ఎస్.అవినాష్, దివ్యపిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్‌లు ఉన్నారు.

- January 17, 2025
0
22
Less than a minute
Tags:
You can share this post!
editor