హిట్ మిషన్ అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు షానియల్ డియో తన తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. హైదరాబాద్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన చిత్రబృందం తరువాత ప్రెస్ మీట్‌లో పాల్గొని ఆనందాన్ని పంచుకుంది. అడివి శేష్ మాట్లాడుతూ ఈ సినిమాను ఎంతో ప్రేమతో చేశామని, ప్రేక్షకులు కూడా అదే ప్రేమతో ఆదరించారని కృతజ్ఞతలు తెలిపారు. మృణాల్ ఠాకూర్ కూడా తన పాత్రకు వచ్చిన స్పందనపై సంతోషం వ్యక్తం చేసింది. దర్శకుడు షానియల్ డియో ప్రేక్షకుల ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మొత్తం టీమ్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.
- April 11, 2026
0
12
Less than a minute
You can share this post!
editor

