టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఏ బంధంలోనైనా అవగాహన చాలా ముఖ్యమని, లివింగ్ రిలేషన్ ద్వారా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. పాత కాలంలో పెళ్లి తర్వాతే భాగస్వామి గురించి తెలుసుకునే పరిస్థితి ఉండేదని, దాంతో ఎన్నో కాంప్రమైజ్‌లు చేయాల్సి వచ్చేదని చెప్పారు. కానీ ప్రస్తుతం లివింగ్ రిలేషన్ వల్ల ముందే స్వభావం, ఆలోచనలు తెలుసుకోవచ్చని ఆమె అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో పుట్టి, మలేషియాలో పెరిగిన మానస కోడింగ్‌తో పాటు మోడలింగ్‌లో రాణించి మిస్ ఇండియా కిరీటం సాధించింది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
- April 11, 2026
0
63
Less than a minute
You can share this post!
editor

