మణిరత్నం సినిమా ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బ్రాహ్మణి.!

మణిరత్నం సినిమా ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బ్రాహ్మణి.!

టాలీవుడ్ హీరో బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న సినిమా డాకు మ‌హారాజ్. ఈ సినిమాకు బాబీ  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోకి డాకు మ‌హారాజ్ టీం నుండి ద‌ర్శ‌కుడు బాబీ, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ వ‌చ్చి హడావుడి చేశారు. ఈ షోలో థ‌మన్ అడిగిన పలు ప్రశ్నలకు బాలయ్య సమాధానమిచ్చారు. ‘మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు?’ అని థ‌మ‌న్ బాల‌య్య‌ని అడుగ‌గా.. బాలయ్యా స‌మాధాన‌మిస్తూ.. నా ఇద్ద‌రు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వినిల‌ను తాను గారాబంగా పెంచానని అయితే తాను బ్రాహ్మణికి ఎక్కువగా భయపడతానని తెలిపారు. మ‌ణిర‌త్నం సినిమా ఛాన్స్  ఇస్తే ఆ ఆఫ‌ర్‌ని బ్రాహ్మణి రిజెక్ట్ చేసింద‌ని చెప్పుకొచ్చారు. నా చిన్న కూతురు తేజ‌స్విని నటిస్తుందేమో అనుకున్నాను కానీ, ఆమె కేవ‌లం అద్దంలో న‌టించేద‌ని చెప్పుకొచ్చారు బాల‌య్య‌. ఇక నా త‌ర్వాత సినిమా హీరోలలో చిరంజీవి అంటే బ్రాహ్మణికి చాలా ఇష్ట‌మ‌ని బాల‌య్య అన్నారు.

editor

Related Articles