ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న వాళ్లల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ గతేడాది దళపతి విజయ్‌తో ది గోట్ సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లక్కీ భాస్కర్‌తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ది గోట్ సినిమా ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయింది. త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులకు హాయ్ చెప్పనుంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన విషయాన్ని ఒకటి షేర్ చేసింది. విజయ్‌తో కలిసి నటించిన ది గోట్ సినిమా విడుదలయ్యాక నా నటనపై ఆన్‌లైన్‌లో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్‌తో వారంపాటు నేను డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేశాయంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనాక్షి చౌదరి మరోవైపు జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

- January 6, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor