ప్రపంచ సినిమా రంగంలో 82వ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అమెరికాలోని కాలిఫోర్నియా బేవర్లీ హిల్స్‌లో జరిగాయి. ఈ ఈవెంట్‌కు సినీతారలు హాజరై సందడి చేశారు. ఇక ఈ అవార్డులలో హాలీవుడ్ సినిమా ఎమిలియా పెరెజ్ సత్తా చాటింది. ఉత్తమ సినిమాతో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ హీరోయిన్ విభాగంలో ది సబ్ స్టాన్స్ సినిమాలో నటనకు గాను హాలీవుడ్ నటి డెమి మూర్ అవార్డును కైవసం చేసుకుంది. 82వ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ విజేతలను ఒకసారి పరిశీలిస్తే..
ఉత్తమ చిత్రం – ఎమిలియా పెరెజ్, ఉత్తమ నటి – డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఉత్తమ చిత్రం (డ్రామా) – (ది బ్రూటలిస్ట్), ఉత్తమ నటుడు (డ్రామా) – అడ్రియన్ బ్రాడీ, (ది బ్రూటలిస్ట్), ఉత్తమ మహిళా నటి (డ్రామా) – ఫెర్నాండా టోర్రెస్, (ఐయామ్ స్టిల్ హియర్), ఉత్తమ నటుడు – సెబాస్టియన్ స్టాన్ (ఎ డిఫరెంట్ మ్యాన్), ఉత్తమ యానిమేటెడ్ చిత్రం – ఫ్లో, ఉత్తమ దర్శకుడు – బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమిలియా పెరెజ్), ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్), ఉత్తమ నటుడు (టీవీ) – హిరోయుకి సనాడా (షోగన్), ఉత్తమ నటి (టీవీ) – జెస్సికా గన్నింగ్ (బేబీ రైన్డీర్), ఉత్తమ స్క్రీన్ ప్లే – పీటర్ స్ట్రాగన్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – ట్రెంట్ రెజ్నార్ (ఛాలెంజర్స్) మొదలైన సినిమాలు ఉన్నాయి.