‘ది కేరళ స్టోరీ’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ దర్శక నిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్‌లాల్ షా తెరకెక్కించిన సినిమా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’. ఆదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ పరాజయం గురించి ఆదా శర్మ మాట్లాడింది. హిట్ సినిమాలో నటించడం కంటే మంచి సినిమాలో నటించడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తా. నా పాత్రకు వంద శాతం న్యాయం చేశానా, లేదా అనేది మాత్రమే ఆలోచిస్తా. ఒక సినిమా హిట్ అవ్వడానికి. ఫ్లాప్ అవ్వడానికి రకరకాల కారణాలుంటాయి. వాటి గురించి నేను పట్టించుకోను. నా సినిమా ఎంత వసూలు చేసింది, అనే విషయాన్ని కూడా నేను పట్టించుకోను. నంబర్ల గురించి ఆలోచిస్తే పాత్రపై దృష్టి పెట్టలేం. ‘ది కేరళ స్టోరీ’ చేస్తున్నప్పుడు అది ఇంత హిట్ అవుతుందని ఊహించి నేను చేయలేదు. కానీ అలా జరిగిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ 778 కోట్లు రాబట్టింది. ‘బస్తర్’ రిజల్ట్ ఇలా ఉంటుందని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది.. దట్సాల్.’ అంటూ అందంగా నవ్వేసింది ఆదా శర్మ.

- March 25, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor