తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈటీవీ విన్ తీసుకొస్తున్న కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారు. తిరువీర్ ఈ సినిమాలో వీర ప్రతాప్‌గా ప్రేక్షకులను అలరిస్తాడని నమ్మకం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలయికగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందిని రెడ్డి, కోన వెంకట్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- April 16, 2026
0
3
Less than a minute
You can share this post!
editor

