సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పవర్ పేట’ సినిమా అనౌన్స్మెంట్తోనే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కంటెంట్ బేస్డ్ స్టోరీతో ప్రత్యేకంగా నిలుస్తుందని అంచనా. 16 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందీప్ కిషన్ ఈ సినిమాలో తన కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్ డార్క్, గ్రిట్టీ టోన్‌తో ఆకట్టుకుంటోంది. రక్తంతో తడిసిన చెస్ బోర్డు, విరిగిపోయిన పీసులు, నలిగిన గులాబీ ప్రేమ, శక్తి, రాజకీయాల మధ్య జరిగే సంఘర్షణను సూచిస్తున్నాయి. మణిశర్మ సంగీతం, మధీ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు బలాన్ని ఇస్తున్నాయి. భావోద్వేగాలు, పవర్ గేమ్స్ కలయికగా ‘పవర్ పేట’ ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
- April 16, 2026
0
131
Less than a minute
You can share this post!
editor

