బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘రైడ్ 2’ యాక్షన్, మాస్, కామెడీలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఒకడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. రితేష్ దేశ్‌ముఖ్, వాణికపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసే అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేస్తూ వారిని నిద్రపోకుండా చేస్తుంటాడు. అయితే, ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై ఐటీ దాడి చేయాలని అమయ్ పట్నాయక్‌కి ప్రభుత్వం నుండి ఆదేశాలు అందుతాయి. ఈ సందర్భంలో దాడి కోసం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం సంభవించిందనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది.

- April 8, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor