బాహుబలి 1 తర్వాత తమన్నాకి సరైన హిట్ పడలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది ఈ హీరోయిన్. అయితే చాలారోజుల తర్వాత తమన్నా తెలుగులో ఒక సినిమా చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2. 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ఇంకా 10 రోజులు కూడా లేకపోవడంతో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఓదెల 2 టీమ్‌తో కలిసి బాబుల్‌నాథ్ ఆలయానికి వెళ్లిన తమన్నా శివుడికి ప్రత్యేక పూజలు చేసి సినిమా హిట్ కావాలని కోరుకుంది. ఈ సినిమాలో తమన్నా ఒక నాగ సాధువు పాత్రలో కనిపించనుంది.

- April 8, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor