5 నిమిషాల సీన్ కోసం రాజ‌మౌళి దాదాపు 100 కోట్లు ఖర్చు..!

5 నిమిషాల సీన్ కోసం రాజ‌మౌళి దాదాపు 100 కోట్లు ఖర్చు..!

ఇప్పుడు మ‌హేష్ బాబుతో రాజమౌళి భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కేఎల్ నారాయణ సుమారు రూ.1,000 కోట్లతో తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూళ్లను పూర్తిచేసిన జ‌క్క‌న్న‌ మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లోనే జ‌రుపుతున్నాడని స‌మాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా  న‌టిస్తోంది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

editor

Related Articles