ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ కోసం సరికొత్త దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే బూతుల వాడకం ఎక్కువైంది. సినిమా రిలీజ్‌కి ముందు టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అందులో బూతులని గట్టిగా వాడుతున్నారు. మరి మేకర్స్ బూతులు సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తాయా అని గట్టిగా నమ్ముతున్నారా, అందుకే సినిమాలలో కొన్ని బూతు డైలాగులని తప్పనిసరి వాడుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ బూతు డైలాగుల ట్రెండ్ ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి నుండి నడుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా టైమ్‌లోనే బూతులతో పబ్లిసిటీ చేసుకోవటం మొదలైంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందులోని బూతులని విని అందరూ అవాక్కయ్యారు. కొందరు దీనిపై ఘాటుగా కూడా స్పందించారు. రీసెంట్‌గా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న యాక్షన్ సినిమా ది పారడైస్ సినిమా టీజర్‌లో కూడా దారుణమైన బూతు పదం వినిపించింది. నాని లాంటి హీరో సినిమాలో కూడా ఇలాంటి బూతు పదం విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆగేలా కనిపించడం లేదు.

- April 15, 2025
0
37
Less than a minute
Tags:
You can share this post!
editor