దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఎ.డి’లో కర్ణుడి పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు. తనకు భారతీయ పురాణాలు, చరిత్రపై ఎంతో గౌరవం ఉందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ‘‘ద్రోణ వధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడితో చెప్పారు. ఒకసారి మహాభారతం చదవండి. ముఖ్యంగా వివేక్ దేబ్‌రాయ్ అనువాదాన్ని చదవాలని సూచిస్తున్నాను. గూగుల్‌లో వెతికినా శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించారో తెలుస్తుంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ‘కల్కి 2’ కోసం వేచి చూడండి’’ అని ఆయన పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ‘కల్కి 2’ నిర్మాణ దశలో ఉంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

