షారుఖ్‌కు సుప్రీంకోర్టులో గుడ్‌న్యూస్

షారుఖ్‌కు సుప్రీంకోర్టులో గుడ్‌న్యూస్

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని ఆయన నివాసం ‘మన్నత్’లో అదనపు నిర్మాణ పనులకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కర్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం, ఈ పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తం చేసింది. గతంలో ఇదే అంశంపై ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ను ఆశ్రయించగా, 2025లో ఆ పిటిషన్‌ను కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది.

సుప్రీం కోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది ఇది సెలబ్రిటీకి సంబంధించిన కేసు కాబట్టి ప్రత్యేకంగా చూడొద్దని వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, షారుఖ్ స్టార్‌డమ్‌తో తమ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ ఒక వ్యక్తి తన సొంత ఇంటిలో నిర్మాణాలు చేపడితే, అందులో ఇతరులు అనవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Related Articles